కేతి బచావో( పొలాలను రక్షించండి) అభియాన్ కార్యక్రమం నిర్వహించిన- మండల వ్యవసాయ అధికారి కే సతీష్ కుమార్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

కేతి బచావో( పొలాలను రక్షించండి) అభియాన్ కార్యక్రమం నిర్వహించిన- మండల వ్యవసాయ అధికారి కే సతీష్ కుమార్

 పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మండలంలోని అంతర్గం, ముర్మూర్, ఎల్లంపల్లి, కుందనపల్లి గ్రామల లో కేతి బచావో (పొలాలను రక్షించండి) అభియాన్ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి కే సతీష్ కుమార్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కే సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ కాలంలో ఏ పంటలు వేయాలో, ఆ పంటలకు ఏ మందులు వాడాలో, పంటలకు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలో రైతులకు, ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. రైతులు పండించాల్సిన పంటల రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రీయ ఎరువులతో నేల లోని భూసారాన్నిపెంపొందించాలని,యూరియాకుప్రత్యామ్నాయం గా నానో ఎరువులు, నీటిలో కరిగే ఎరువులు వాడాలని, పంట వ్యర్థాలు కాల్చకుండా నేల లో కలియదున్ని ఎస్ ఎస్ పి ఎరువు చల్లి ఎరువుగా మార్చాలని, ఈ వానాకాలం ఎల్ నినో వాతావరణ సమస్య నుండి తప్పించుకోవడానికి వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయం గా పెసర, కంది, మినుము, బొబ్బెర, నువ్వులు, చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని,తప్పని సరి వరి వేయవలసి వస్తె తక్కువ పంట కాలం ఉన్న వరి రకాలు సాగు చేయాలని,ప్రస్తుతం రాష్ట్రప్రభుతం, రైస్ మిల్లర్లు సూచించిన, మార్కెట్ లో డిమాండ్ ఉన్న సన్న వరి రకాలు మాత్రమే సాగు చేయాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముర్ ముర్ సర్పంచ్ మగ్గిడి స్వరూప-శ్రీనివాస్, ఎల్లంపల్లి సర్పంచ్ ఆరుముల్ల మాధవి, కుందనపల్లి సర్పంచ్ ఆర్కుటి కొమురయ్య , మండల వ్యవసాయ అధికారి కె.సతీష్ , రెవెన్యూ తహశీల్దార్ పడాలవర ప్రసాద రావు , మండల ప్రజా పరిషత్ అధికారి గాంధీరావుపేట తిరుపతి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఎస్ కమల, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...