పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన సీపీఐ రాజకీయ శిక్షణా శిబిరంమాజీ ఏఐవైఎఫ్ నాయకులు, సీపీఐ నేతలతో ఆత్మీయ భేటీ
ఇది మన హక్కు చీఫ్ ఎడిటర్✍️
పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన సీపీఐ రాజకీయ శిక్షణా శిబిరం
మాజీ ఏఐవైఎఫ్ నాయకులు, సీపీఐ నేతలతో ఆత్మీయ భేటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణా శిబిరం వేములవాడలోని మహానందీశ్వర బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించారు. ఈ శిబిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు పనిచేసిన శనిగరపు చంద్రశేఖర్ (తిరుమల) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ నాయకుడు, సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత కామ్రేడ్ చాడా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కామ్రేడ్ గౌతం గోవర్ధన్‌లతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.
అలాగే అప్పటి ఏఐవైఎఫ్ కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, పైడిపల్లి రాజు, పంజాల శ్రీనివాస్, గోసిక మోహన్, సుతారి రాములు, ఇరుగురాల భూమేశ్వర్‌లతో కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
కామెంట్‌లు