3, జూన్ 2026, బుధవారం

స్వశక్తి మహిళలు చిన్న వ్యాపారాల నుంచి పరిశ్రమల స్థాయికి ఎదగాలి: మేయర్ మహంకాళి స్వామి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

స్వశక్తి మహిళలు చిన్న వ్యాపారాల నుంచి పరిశ్రమల స్థాయికి ఎదగాలి: మేయర్ మహంకాళి స్వామి

స్వశక్తి మహిళలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడేలా వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బుధవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ధనశ్రీ పట్టణ మహిళా సమాఖ్యకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌ల నూతన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలోని స్వశక్తి మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు అందించి వ్యాపార యూనిట్లు స్థాపించుకునేందుకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంకులు, కమ్యూనిటీ హాళ్లు, బస్సులు వంటి యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించారని పేర్కొన్నారు.

పట్టణ ప్రాంత మహిళలతో సోలార్ ప్లాంట్లు, ఎంఎస్‌ఎంఈ యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. మహిళలు చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆసక్తి గల మహిళలకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ, మెప్మా అధికారులు, సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి