ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రైతుల సౌకర్యార్థం రూ.5 లక్షలతో మట్టి రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం– పనులు ప్రారంభించిన ఆకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి–సుధాకర్
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రైతుల సౌకర్యార్థం రూ.5 లక్షలతో మట్టి రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం
– పనులు ప్రారంభించిన ఆకెనపల్లి సర్పంచ్ గాదె స్రవంతి–సుధాకర్
అంతర్గాం: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో రైతుల సౌకర్యార్థం రూ.5 లక్షల ప్రత్యేక నిధులతో మట్టి రోడ్డు మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి–సుధాకర్ ఘనంగా ప్రారంభించారు. జేసీబీ, ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గాదె స్రవంతి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో రైతులు తమ పొలాలకు ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు ఈ రహదారి మరమ్మత్తు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధే తమ లక్ష్యమని, నాణ్యతతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
ఈ రహదారి అందుబాటులోకి రావడంతో వందల ఎకరాల రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్రి రాజ్‌కుమార్, పూదరి స్వామి, ఇతనవేణి రామ్మూర్తి, మెరుగు రవి, ఆకుల రాము, సామల కుమార్, సామల అభి, అగ్గి భూమేష్, రైతులు, యువకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
కామెంట్‌లు