సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి: ఏఐటీయూసీ
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి: ఏఐటీయూసీ
రామగుండం, జూన్ 19 (ఇది మన హక్కు): సింగరేణి అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా-1 పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోల్ ఇండియా తరహాలో సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు, ప్రతి నెల మొదటి వారంలో వేతనాల చెల్లింపు, పీఎఫ్ వివరాల వెల్లడితో పాటు జీత స్లిప్పులు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించిన వారు, సమస్యలు పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపట్టి జీఎం కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.
ఇది మన హక్కు సమాచార పత్రిక..
కామెంట్‌లు