ఇస్రో సందర్శనకు ఖని విద్యార్థి రిశ్విక్ -- ఇస్రో చైర్మన్ ను కలిసే అవకాశం --ఈ నెల 12న నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీ
ఇస్రో చైర్మన్ ను కలిసే అవకాశం
ఈ నెల 12న నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీ
బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను సందర్శించడానికి, నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీలో పాల్గొనడానికి స్థానిక కృష్ణవేణి స్కూల్ విద్యార్థి రాకం రిశ్విక్ కు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ సంస్థ ఇస్కాన్ గత ఫిబ్రవరి 3న ఆన్లైన్ లో నిర్వహించిన ప్రపంచ స్థాయి 'భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్'లో స్థానిక కృష్ణవేణి స్కూల్ విద్యార్థి రాకం రిశ్విక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి ప్రశంసలందుకున్నాడు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనగా.. 95 శాతం కంటే అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి జిల్లా స్థాయి ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు, కృష్ణవేణి స్కూల్స్ లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న రాకం రిశ్విక్ జిల్లా స్థాయి సెకండ్ టాపర్ గా నిలిచి తన ప్రతిభను చాటాడు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధి ప్రేమ్ రాజ్ చైతన్య, రిశ్విక్ కు బహుమతిగా సైకిల్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ నెల 12న బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను సందర్శించడానికి, నేషనల్ టాపర్స్ అవార్డ్ సెరెమనీలో పాల్గొనడానికి ఆహ్వానం పంపారు. ఇస్రో చైర్మన్, ఏరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్.సోమనాథ్ ను కలిసే అవకాశంతో పాటు ఆయనతో గ్రూప్ ఫోటో, డమ్మీ రాకెట్ లాంచింగ్ డెమోను తిలకించడానికి తల్లిదండ్రులతో కలిసి రిశ్విక్ బెంగళూరు బయలుదేరి వెళ్ళాడు. కాగా తమ పాఠశాల విద్యార్థి రిశ్విక్ ఇస్రో సందర్శనకు ఎంపిక కావడంపట్ల పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, కరస్పాండెంట్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, క్యాంపస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
కామెంట్‌లు