ప్రతిభకు గోపా పెద్దపల్లి శాఖ ప్రోత్సాహం 100 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️

 గోపా పెద్దపల్లి శాఖ ప్రోత్సాహం 100 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

పెద్దపల్లి, జూన్ 14: గోపా గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన సుమారు 100 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కార్ అవార్డుల ప్రదానోత్సవం స్థానిక సాయి లీలా రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. అలాగే ఇటీవల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన రామగుండంకు చెందిన బాలసాని తిరుపతి గౌడ్, మంథని మున్సిపాలిటీకి చెందిన మాచిడి రాజు గౌడ్‌లను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దగొని రామ్మోహన్ గౌడ్, బత్తిని సత్యనారాయణ గౌడ్, వీరయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు అమరగోని నరసయ్య గౌడ్, శంకర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మండ రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బందారపు యాదగిరి గౌడ్, కోశాధికారి కొక్కిసా దేవేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు బాలసాని స్వామి గౌడ్, గాదర్ల కొమరయ్య గౌడ్, ముక్కెర రాజయ్య గౌడ్, తిరుమల సురేందర్ గౌడ్, బెందె నాగభూషణ్ గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...