బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి: సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా

మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్టు చేసి నిష్పక్షపాత విచారణ జరపాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
కేసు నమోదై రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాల్సి ఉండగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత బాలికకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించి, కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జూపాక శ్రీనివాస్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, తోకల రమేష్ ఈ ప్రకటన విడుదల చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...