అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దేవి స్రవంతి లక్ష్మీనరసయ్యను పరామర్శించిన డా. పసుల రామ్మూర్తి
ఇది మనహక్కు రామగుండం మండల్ రిపోర్టర్ ✍️
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దేవి స్రవంతి లక్ష్మీనరసయ్యను పరామర్శించిన
డా. పసుల రామ్మూర్తి
ఇటీవల వేసవికాలంలో తీవ్ర ఎండల కారణంగా డీహైడ్రేషన్‌కు గురై అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కన్నాల మాజీ ఎంపీటీసీ దేవి స్రవంతి లక్ష్మీనరసయ్యను మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న డాక్టర్ పసుల రామ్మూర్తి, మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఆమె త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేవి స్రవంతి లక్ష్మీనరసయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..
కామెంట్‌లు