కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా.. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
కేసీఆర్ పాలనలో రైతులు రాజులుగా.. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం
వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం రాజుల్లా బతికారని, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో రైతుల జీవితాలు ఆగమాగమయ్యాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. శనివారం టీటీఎస్ అంతర్గాం, పెద్దంపేట గ్రామాల వరి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులను ఆదుకునే ధ్యాస లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో సకాలంలో ఎరువులు, రైతుబంధు, ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారని గుర్తు చేశారు.
20 రోజులుగా ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండటంతో అకాల వర్షాలకు తడిసి రైతులకు నష్టం జరుగుతోందని, బస్తాల్లో కిలోల కోతలతో ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపు అయులయ్య యాదవ్, ఆముల శ్రీనివాస్, కరివేద స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, కోలా సంతోష్, కొలిపక శరణ్య మధుకర్ రెడ్డి, బండారి ప్రవీణ్, ధరణి రాజేష్, తుంగపిండి సతీష్, బండి మహేష్ గౌడ్, బోడ్డుపల్లి శ్రీనివాస్, ఎలుక కొమురయ్య, కాంపల్లి సంతోష్, విష్ణు, సుబ్రహ్మణ్యం, కాంపల్లి రాజేష్, అవునూరి ప్రశాంత్, గోర్క సంతోష్, దొమ్మేటి వాసు, ఈదునూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు