మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం టాపర్స్‌ను సన్మానించిన అడ్వకేట్ షానవాజ్ ఖాన్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఘన విజయం టాపర్స్‌ను సన్మానించిన అడ్వకేట్ షానవాజ్ ఖాన్
గోదావరిఖని: సప్తగిరి కాలనీలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ రామగుండం బాయ్స్-1 విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మార్చి-2026 ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల అడ్వకేట్ షానవాజ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన టి.అజయ్, ఎన్.కౌశిక్, ఎం.డి.సోహెల్, ఎం.డి.అర్హాన్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుల్భాం శ్రీధర్ను కూడా ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం షానవాజ్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల విజయం పాఠశాల నాణ్యమైన విద్యకు నిదర్శనమన్నారు. ఉపాధ్యాయుల కృషి, క్రమశిక్షణతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రశంసించారు. ప్రజలు తమ పిల్లలకు ఈ పాఠశాలలో అడ్మిషన్ కల్పించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు.
100 శాతం ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కామెంట్‌లు