పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రంపెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్

 ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.
సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ ఒక ప్రకటన లో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని,
​ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజల తోపాటు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న, చిన్న వ్యాపారులపై పెను భారం పడుతుందని అన్నారు. పెట్రో ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా,అట్టి ప్రయోజనాన్ని ప్రజలకు అందించకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ధ్యేయంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు.
ఇప్పటికే గ్యాస్ కోరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో మరో భారాన్ని మోపారని ఆయన ధ్వజమెత్తారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించి, పాత ధరలను పునరుద్ధరించి
పేద ప్రజలపై భారం పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలనీ,
కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...