పూలే విగ్రహంపై దాడి అమానుషం… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఎస్‌ఎస్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్షల్ దుర్గం
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
పూలే విగ్రహంపై దాడి అమానుషం… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఎస్‌ఎస్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొందరు దుండగులు అగౌరవపరచడంపై సమతా సైనిక దళం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక విప్లవ యోధుడు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక అయిన పూలే విగ్రహాన్ని కాలితో తన్ని దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు.
పట్టపగలే, పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరగడం వెనుక కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ దళిత, బహుజన ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహనీయుల విగ్రహాలపై దాడులు అణగారిన వర్గాల గౌరవంపై దాడులేనని, ఇలాంటి చర్యలను అణచివేయడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. దుండగులపై పీడీ యాక్ట్ లేదా ఎన్‌ఎస్‌ఏ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అదే స్థలంలో విగ్రహాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కామెంట్‌లు