తహసీల్దార్ కార్యాలయ నూతన భవనానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి అభినందనీయం : మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
తహసీల్దార్ కార్యాలయ నూతన భవనానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి అభినందనీయం మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్
రామగుండం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు చేయించి, నిర్మాణం చేపట్టేలా ఆదేశించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్ని దశాబ్దాలుగా రామగుండం పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గారు ఎన్నికైన తర్వాత పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.
సుమారు 20 కోట్ల రూపాయలతో ఆరు డివిజన్లలో సమగ్ర అభివృద్ధి పనులు, కోట్ల రూపాయలతో ప్రధాన రహదారుల నిర్మాణం, 250 కోట్లకు పైగా నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, 60 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, గతంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు, ప్రస్తుతం 50 లక్షలకుపైగా నిధులతో తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం చేపట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తోందన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, అనంతరం ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని కన్నూరి సతీష్ కుమార్ పేర్కొన్నారు.
కామెంట్‌లు