పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వెంటనే తగ్గించాలి: సీపీఐ డిమాండ్
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వెంటనే తగ్గించాలి: సీపీఐ డిమాండ్
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని చౌరస్తా వద్ద ఆటో ట్రాలీని తాళ్లతో లాగి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కే. కనకరాజ్, కార్పొరేటర్ మార్కపూరి సూర్య మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం చెప్పిన కొద్ది రోజులకే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు, గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల దేశానికి నష్టం లేదని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు ధరలు ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాటేటి శంకర్, తొడుపునూరి రమేశ్ కుమార్, వై. లెనిన్, గొడిశల నరేశ్, కరీం, చంద్రశేఖర్, సుధీర్, జగన్, ఆసాల నవీన్, కొమ్ము రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు