13, మే 2026, బుధవారం

పెద్దపల్లి మాదిగ మహాశక్తి సభను జయప్రదం చేయండి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

పెద్దపల్లి మాదిగ మహాశక్తి సభను జయప్రదం చేయండి 

ఈనెల 17వ తేదీ ఆదివారం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్‌లో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే మాదిగ మహాశక్తి సభను మాదిగలంతా భారీగా హాజరై విజయవంతం చేయాలని మాదిగ నాయకులు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సారథ్యంలో, ఆసంపల్లి శ్రీనివాస్, మామిడిపల్లి బాపయ్య, కొంకటి లింగమూర్తి ఆధ్వర్యంలో సభ జరుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో లక్షలాది మంది మాదిగలు ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క మాదిగ అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

మాదిగలంతా మేల్కొని జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని, రామగుండం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి మాదిగ శక్తిని చాటాలని ఆర్నకొండ వెంకటేశ్వర్లు, పుల్లూరి మహేందర్, బూడిద సమ్మయ్య, పేరుకరవి అభినయ్ కోరారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి