ఏఐటీయూసీ మండల మహాసభలను విజయవంతం చేయాలి: కడారి సునీల్

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

ఏఐటీయూసీ మండల మహాసభలను విజయవంతం చేయాలి: కడారి సునీల్

 పెద్దపెల్లి జిల్లా 14 మండలాల్లో ఏఐటీయూసీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు మే 12 నుంచి జూన్ 10 వరకు మండల మహాసభలు నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపునిచ్చారు.
మండలాల్లోని హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో పాటు వివిధ విభాగాల కార్మిక సంఘాలను కలుపుకుని మండల నిర్మాణాన్ని పటిష్టం చేయాలని కోరారు. దేశంలో కార్మిక చట్టాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కార్మికులపై పని భారం పెంచి, ఉద్యోగ భద్రతను దెబ్బతీయడానికి పెట్టుబడిదారులు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
44 కార్మిక చట్టాలను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపైనే ఉందని పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర మహాసభల సందర్భంగా అన్ని మండలాల్లో ఏఐటీయూసీని విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల నాయకత్వం సమన్వయంతో మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...