భవిత కేంద్రం ప్రారంభించిన- సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
భవిత కేంద్రం ప్రారంభించిన- సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టిటిఎస్ అంతర్గం గ్రామంలోని మండల ప్రజాపరిషతు ఉన్నత పాఠశాల లో ఐ ఇ ఆర్ పి మాలతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్ హాజరై భవిత కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అంగోత్ రవికుమార్ నాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంలోని వికలాంగులు అంటే ఇందులో సుమారు 21 రకాలకు సంబంధించిన బాల, బాలికలు ఉండడం జరుగుతుంది. వీరిని దృష్టిలో పెట్టుకొని మూగ,వినికిడి లోపం, మతి స్థిమితం లేని వారు ఇంకా అనేక రకాల వ్యాధులకు సంబంధించిన వీరికి ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు పాఠశాల సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు విద్యతోపాటు శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకు ఎవరెవరికి ఏ రకంగా విద్యను, కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా వారికి అర్థమయ్యే విధంగా సంబంధిత ఉపాధ్యాయులు వారికి నేర్పడం జరుగుతుంది.దీని ద్వారా సంబంధిత బాల, బాలికలు శారీరకంగా, మానసికంగా ఎదిగి ఒక గొప్ప మేధావులుగా తయారవుతారని సర్పంచ్ ఆంగోతు రవికుమార్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్ , ఎం ఈ ఓ ముక్కెర సంగీత,ఐ ఇ ఆర్ పి మాలతి,రేణుక, సి సి ఒ శ్రీధర్,ఎం ఐ ఎస్ జ్యోతి,సి ఆర్ పి శ్రీనివాస్ ,పంచాయతీ కార్యదర్శి అంకం రవికుమార్, ఉప సర్పంచ్ ఉష, వార్డు సభ్యులు బాణాల శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు