బిజెపి ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

బిజెపి ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి...

భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. 
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ గారు హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క రూపాయికే దహన సంస్కారాలు జరిపే అటువంటి స్కీమును ఆ యొక్క స్కీమును గత ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడం వలన ఇప్పుడున్న ప్రభుత్వం ఆ స్కీమును ఆపివేయడం వలన రామగుండం కార్పొరేషన్ లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారు చనిపోతే పేద ప్రజలైనటువంటి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తక్షణమే ఆఖరి దప స్కీమును వెంటనే మొదలుపెట్టాలని అలాగే ఈ యొక్క వృత్తిపై ఆధారపడినటువంటి దాదాపు 120 కుటుంబాలు సంబంధించిన వారు రోడ్డుపైన పడడం జరిగిందని వారన్నారు అలాగే గతంలో ఈ స్కీము ద్వారా పనిచేసిన వారికి చెల్లించేటువంటి దాదాపు 26 లక్షల రూపాయల బిల్లును వెంటనే రిలీజ్ చేసి వారికి అందజేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారం రోజులలో బిల్లు చెల్లించని యెడల భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుందని హెచ్చరించారు
అలాగే బిజెపి జిల్లా కార్యదర్శి సోమారపు లావణ్య గారు మాట్లాడుతూ జన మరణ ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులు వెంటనే పత్రాలను అందజేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే కార్పొరేషన్ లోని అధికారులు అంతా నిమ్మకు నీరెతినట్టు వ్యవహరిస్తున్నారని వారన్నారు ఇప్పటికైనా రామగుండం మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని వారు పాలక పక్షాన్ని కోరారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ముదిరాజ్, నాయకులు కొండపర్తి సంజీవ్, కొమ్మ శ్రీనివాస్, ఐత పవన్, సిరిసేటి మల్లేష్, అందే రాజ్ కుమార్, బుంగ మహేష్ బూడిద రమేష్, పంగ రవి, కన్నూరి భాస్కర్, సప్ప నాగరాజు, నరేష్ గౌడ్ వేరుకొండ ప్రవీణ్ గౌడ్, మెరుగు శ్రీనివాస్, భాష బోయిన వాసు ,ఆకాష్ గౌడ్ రామగుండం కార్పొరేషన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చల్లా శోభారాణి, కాంపెల్లి రఘు, చుక్కల రాములు ,వెలుతురు సరిత రాజయ్య ,అరిగేల శ్రావణ్, సిలివేరి అంజి ,ఇరుగురాల శివ ,పాశం రాజు, ఆడెపు కార్తీక్ ,చుక్క సాయి ప్రదీప్, లింగాల శంకర్, నాగ సుజశ్రీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...