మహాత్మా జ్యోతిబా పూలే బి.సి. వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..... జిల్లా కో-ఆర్డినేటర్ మణి దీప్తి
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
మహాత్మా జ్యోతిబా పూలే బీ. సి వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..... జిల్లా కో-ఆర్డినేటర్ మణి దీప్తి
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREI) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలోని గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ మని దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల (GPA) ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని,
బాలురకు సుల్తానాబాద్, కాటారం, రామగుండం మొత్తం 240 సీట్లు, బాలికలకు పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్, గుంజపడుగు మొత్తం 320 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు మే12 లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా కింది ఇచ్చిన వెబ్‌సైట్లలో సమర్పించవచ్చు.
https://mjptbcwreis.telangana.gov.in ,
https://mjptbcadmissions.org/MJP-inter
ఇప్పటికే బి.సి. గురుకుల పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి దరఖాస్తులు నేరుగా సంబంధిత పాఠశాలల నుండే పంపించబడతాయని,జిల్లాలోని అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కో-ఆర్డినేటర్ మని దీప్తి ఆ ప్రకటనలో పేర్కొన్నారు..
కామెంట్‌లు