ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత ఆరెపల్లి శ్రీనివాస్ (టైసన్ శ్రీను)
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీత ఆరెపల్లి శ్రీనివాస్ (టైసన్ శ్రీను)
సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (INTUC) జనరల్ సెక్రటరీ ఆరెపల్లి శ్రీనివాస్ (టైసన్ శ్రీను) ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డును అందుకోవడం తన జీవితంలో మర్చిపోలేని క్షణమని తెలిపారు.
తనను ఈ అవార్డుకు ఎంపిక చేసిన INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారికి, జ్యూరీ సభ్యులకు, నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు తనపై ఉన్న బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
ఈ విజయం కేవలం తనదే కాకుండా తనను ప్రోత్సహించిన జనక్ ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు, సింగరేణి సంస్థలోని ప్రతి ఒక్క INTUC కార్యకర్తలు, సహోద్యోగులందరిదని అన్నారు. వారి మద్దతు లేకపోతే ఈ స్థాయికి చేరుకోలేనని స్పష్టం చేశారు.
ఈ అవార్డును తన తల్లిదండ్రులకు, అత్తమామలకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
కామెంట్‌లు