యైటింక్లైన్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మేయర్ మహంకాళి స్వామి
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
యైటింక్లైన్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మేయర్ మహంకాళి స్వామి
రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఎంఎల్‌ఏ సూచనల మేరకు యైటింక్లైన్ కాలనీలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వార్డు సందర్శనలో భాగంగా శనివారం 15వ డివిజన్‌ను సందర్శించిన ఆయన, స్థానిక కార్పొరేటర్ బుర్ర శశికళ ముత్యాలతో కలిసి కెకె నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు, చెట్ల గుబుర్ల తొలగింపు పనులను పర్యవేక్షించారు. పేరుకుపోయిన చెత్తను తొలగించి వీధులను పరిశుభ్రం చేయించారు. అనంతరం మాట్లాడిన మేయర్, పార్టీలకతీతంగా అన్ని డివిజన్లను సమాన దృష్టితో అభివృద్ధి చేస్తూ ఎంఎల్‌ఏ నాయకత్వంలో నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
చాలా కాలంగా ఈ డివిజన్ నిర్లక్ష్యానికి గురై వెనుకబడి ఉందని ఆయన అన్నారు. పర్యటనలో స్థానిక సమస్యలను అధికారులు నమోదు చేసుకున్నారని, వాటిని ఎంఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించి రోడ్లు, కాలువలు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, శంకర్ నాయక్, చక్రపాణి, నాయకులు మారెల్లి రాజిరెడ్డి, అనుమ రాములు, శ్రీనివాస్, రాజేష్, నగరపాలక సంస్థ ఇఈ గురువీరతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు