హిందువులారా హిందూ సమ్మేళనం కు తరలిరండి-అధ్యక్షులు తుండ్ల శ్రీనివాస్ పటేల్
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
హిందువులారా హిందూ సమ్మేళనం కు తరలిరండి-అధ్యక్షులు తుండ్ల శ్రీనివాస్ పటేల్
పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం రామగుండం పట్టణం లో కమిటీ సభ్యులతో కలసి స్థానిక శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయం నుండీ అంబేద్కర్ చౌక్ వరకు ఇంటి ఇంటికి తిరుగుతూ రామగుండం పట్టణంలో జెనుకో మైదానంలో మే 03 న జరిగే సమ్మేళనంకు హిందూబంధువులు అందరు కుడ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కమిటీ అధ్యక్షులు తుండ్ల శ్రీనివాస్ పటేల్ కోరారు.ఈ సందర్బంగా అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ కులాలు, ప్రాంతాలు వృత్తులు, రాజకీయ, పార్టీలు వేరైనా మనమంతా హిందువులం అనే భావన కలిగి జీవించినప్పుడే మన దేశాన్ని, ధర్మాన్ని, ఆలయాలను, ఆడబిడ్డలను రక్షించుకోగలమని అన్నారు.అలాగే సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న హిందూ సమ్మెలనంకు హిందువులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తుండ్ల శ్రీనివాస్ పటేల్, సెక్రటరీ రాపోల్ కుసుమ కుమారి, ట్రెజరర్ కంద లోకానందం,నాయకులు కందుల సంధ్య రాణి, పైతరీ రాజు కమిటీ సభ్యులు కౌశిక వెంకట రమణ, వోడ్డేపల్లి సురేష్, జాగటి శ్రీకాంత్, మడ్డి అన్వేష్, తాటి పెళ్లి శివ ప్రసాద్, రామిని శేశిధర్, తోడుపునూరి సునీల్, పరకాల మురళి గౌడ్,ఇమ్మడిశెట్టి రవి ప్రసాద్,కౌశిక విజయ లక్ష్మి, దొంతుల మాధవి, మామిడి విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు