చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకు ఐక్య పోరాటం అవసరం44 కార్మిక చట్టాల రక్షణ కోసం ఐక్య పోరాటం అవసరం — ఏఐటీయూసీ

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణకు ఐక్య పోరాటం అవసరం
44 కార్మిక చట్టాల రక్షణ కోసం ఐక్య పోరాటం అవసరం — ఏఐటీయూసీ 

రామగుండం నాయకులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ పిలుపు
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్‌లో మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు చిలువేరి లక్ష్మీనారాయణ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే ఆర్‌టీసీ డిపో మరియు మెడికల్ కాలేజీ మెయిన్ చౌరస్తాలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్ జెండా ఎగురవేశారు. నగరమంతా ఎర్ర జెండాలతో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ రాజు, డాక్టర్ అప్పారావు, డాక్టర్ తిరుమలేషా, నర్సింగ్ సూపరింటెండెంట్ లీనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగోలో జరిగిన కార్మిక ఉద్యమంలో అమరవీరుల త్యాగాల ఫలితంగా 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం హక్కులు సాధించబడినట్లు గుర్తు చేశారు. ఆ త్యాగాల స్ఫూర్తితోనే మే-డే ఏర్పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి అమలు చేయాలని చూస్తోందని, దీని వల్ల పనిగంటలు పెరగడం, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ వంటి హక్కులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి 44 కార్మిక చట్టాలను కాపాడాలని, 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అదే చికాగో అమరవీరులకు నిజమైన నివాళి అవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మెడికల్ సిబ్బంది, నర్సులు, శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, ఏఐటీయూసీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...