9, మే 2026, శనివారం

ఎల్బీనగర్‌లో ఉచిత కంటి శిబిరం నిర్వహించిన 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

ఎల్బీనగర్‌లో ఉచిత కంటి శిబిరం నిర్వహించిన 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య 

రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ ఎల్బీనగర్‌లో ఈరోజు కార్పొరేటర్ మార్కపురి సూర్య ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ భవ్య హాజరై ప్రజలకు పరీక్షలు నిర్వహించారు.
ఈ శిబిరంలో డివిజన్‌కు చెందిన సుమారు 100 మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మార్కపురి సూర్య మాట్లాడుతూ, డివిజన్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సిపిఐ జెండా వద్ద ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, సేవలు అందించిన భవ్య కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్ భవ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో కూడా ప్రజల కోసం ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని, డివిజన్ ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి