భవన కార్మికుల హక్కుల కోసం మే 25న ఛలో హైదరాబాద్ కార్మికుల సొమ్ము ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు ఆడెపు శంకర్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

భవన కార్మికుల హక్కుల కోసం మే 25న ఛలో హైదరాబాద్
కార్మికుల సొమ్ము ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించొద్దు  ఆడెపు శంకర్

TUCI అనుబంధ తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ, గోదావరిఖని, పెద్దంపేట లేబర్ అడ్డాల వద్ద “చలో హైదరాబాద్” వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు ఆడెపు శంకర్ మాట్లాడుతూ, 60 ఏళ్లు పైబడిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు ₹9 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీల రీనివల్స్ నిలిపివేసి, ఆరోగ్య పరీక్షల పేరుతో కార్మికుల సొమ్మును దోచుకుంటున్న విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈఎస్ఐ ద్వారా ఆరోగ్య పథకాన్ని అమలు చేసి, సహజ మరణ పరిహారాన్ని ₹5 లక్షలకు పెంచాలని కోరారు.
అదేవిధంగా పెళ్లికానుక, డెలివరీ క్లెయిమ్స్‌ను ₹30 వేల నుంచి ₹1 లక్షకు పెంచి, పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని, నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి లేబర్ అడ్డాల వద్ద షెల్టర్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం మే 25న హైదరాబాద్‌లోని విఎస్టీ నుంచి ఉదయం 10:30 గంటలకు భారీ ప్రదర్శన నిర్వహించి, లేబర్ కార్యాలయం వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. కార్మికులంతా పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, కలవల రాజమల్లు, ఉడుత శ్రీనివాస్, కే బాబు, కే రాజేష్, ఎం సతీష్, కే నారాయణాద్రి, జి లక్ష్మణ్, భీమన్న, పెండ్యాల ఓదెలు, కే లింగయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...