21వ డివిజన్‌లో మెగా పీటీఎం, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్.

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

21వ డివిజన్‌లో మెగా పీటీఎం, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్

21వ డివిజన్ లక్ష్మీపూర్ గేట్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించిన మెగా పీటీఎం, బడిబాట కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గౌరవ పాలకుర్తి మండల విద్యాధికారి విమల, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డివిజన్ పరిధిలోని ప్రతి చిన్నారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు, స్థానికులకు విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ ఎఫ్‌సీఐ, లక్ష్మీపూర్ ప్రాథమికోన్నత పాఠశాల, వీర్లపల్లి ప్రాథమిక పాఠశాల, ఎలుకలపల్లి ప్రాథమిక పాఠశాల, యూపీఎస్ ఎలుకలపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు విద్య ప్రాధాన్యతను వివరించారు..బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి చిన్నారి పాఠశాలలో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని అవగాహన కల్పించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...