13, మే 2026, బుధవారం

నీట్-2026 పేపర్ లీక్ దేశ విద్యా వ్యవస్థపై మచ్చ ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి : డా. మార్షల్ దుర్గం నగేష్

 ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

నీట్-2026 పేపర్ లీక్ దేశ విద్యా వ్యవస్థపై మచ్చ ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి : డా. మార్షల్ దుర్గం నగేష్

 దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-2026 పేపర్ లీక్ ఘటన దేశ విద్యా వ్యవస్థకు మచ్చ అని సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ మండిపడ్డారు. ఈ ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడటమేనని విమర్శించారు..నీట్-2026 పరీక్షను రద్దు చేసి రీ-ఎగ్జామ్ నిర్వహించాలని, సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీక్ అవడం పరీక్షా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని, మాఫియా-అధికారుల కుమ్మక్కుతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పరీక్షా నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై కఠిన చర్యలు తీసుకుని ప్రక్షాళన చేయాలని కోరారు..విద్యార్థుల మానసిక వేదనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డా. నగేష్ డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి