నూతన దారి మైసమ్మ ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు నియోజకవర్గ ప్రజలను మైసమ్మ తల్లి చల్లగా చూడాలి
ఇది మనహక్కు రామగుండం మండలం రిపోర్టర్✍️
నూతన దారి మైసమ్మ ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు
నియోజకవర్గ ప్రజలను మైసమ్మ తల్లి చల్లగా చూడాలి
రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఈరోజు అంతర్గం మండలం పరిధిలోని నూతన దారి మైసమ్మ ఆలయంలో నిర్వహించిన దారి మైసమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు..భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ మహోత్సవంలో స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల విశ్వాసాలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రాంత ప్రజలందరికీ దారి మైసమ్మ తల్లి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు...
కామెంట్‌లు