ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో అధిక శాతం మేర మహిళలకె కేటాయించాలి రాష్ట్ర మేర టైలర్స్ వృత్తి సంక్షేమ సంఘం
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో అధిక శాతం మేర మహిళలకె కేటాయించాలి.
రాష్ట్ర మేర టైలర్ వృత్తి సంక్షేమ సంఘం.
ఈరోజు రాష్ట్ర బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కలిసి తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ జీవో నంబర్ Lr.No. 85/C/సేవింగ్ మిషన్ మహిళ/ 2025-2026 తేదీ.17-02-2026 ప్రకారం కుట్టు మిషన్ లను మేర మహిళలకు ఎక్కువ శాతం కేటాయించాలని వినతి పత్రంను సంఘ వెంకట్రాజం అధ్యక్షతన రాష్ట్ర మేర టైలర్ సంక్షేమ సంఘం తరపున కీర్తి జయంత్, గూడూరు ప్రభాకర్, జర్నలిస్టు గూడూరు లవన్ కుమార్. రామగిరి సుధాకర్, మునిగాల శ్యాంప్రసాద్ నాయకులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కలిసి రాష్ట్రంలో టైలర్ వృత్తి ప్రధాన జీవనాధారంగా, కులవృత్తి ఆధారంగా జీవిస్తూ ఉన్న మా మేర మహిళలకే కుట్టుమిషన్ల కార్యక్రమంలో ఎక్కువ శాతం కేటాయించాలని రాష్ట్ర బీసీ మంత్రివర్యులను కోరడం జరిగింది. దీనికి రాష్ట్ర మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తప్పకుండా మేర మహిళలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మేర సంఘం నాయకులు పాల్గొన్నారు.
కామెంట్‌లు