మేయర్ మహంకాళి స్వామిని కలిసిన ఫ్రెండ్స్ ఫౌండేషన్ – పీవీ నరసింహారావు గారి పుస్తకం బహుకరణ
ఇది మనహక్కు రామగుండం మండలo రిపోర్టర్✍️
మేయర్ మహంకాళి స్వామిని కలిసిన ఫ్రెండ్స్ ఫౌండేషన్ – పీవీ నరసింహారావు గారి పుస్తకం బహూకరణ
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామిని ఈరోజు ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రౌతు గణేష్ కలిసి పీవీ నరసింహారావు గారికి సంబంధించిన పుస్తకాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సమాజ సేవలో వారి పాత్ర ప్రశంసనీయమని, భవిష్యత్తులో కూడా తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మీస వికాస్, మార్క ఆశ్రిత్ గౌడ్, కోలేటి విశాల్, రిషిక్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు