ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహణ
ఇది మనహక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహణ
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారి ఆదేశాల మేరకు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇంద్రసేనా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ.అనూష గారు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర విద్యార్థుల కోసం ‘చైల్డ్ సేఫ్టీ – డ్రగ్స్‌కు నో చెప్పండి’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు మరియు భవిష్యత్ జీవనశైలిపై వాటి ప్రభావం గురించి ఎస్.ఐ.అనూష గారు వివరంగా తెలియజేశారు.ప్రత్యేకంగా యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాదకద్రవ్యాలు శారీరక,మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైనవని, విద్యా జీవితం మరియు భవిష్యత్ లక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి,మంచి స్నేహితులను ఎంచుకోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ సందర్భంగా మహిళల భద్రత,బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ,బాల్య వివాహాల నిర్మూలన మరియు భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కామెంట్‌లు