10, జనవరి 2026, శనివారం

గౌడ జీవనోపాధి కోసం అసెంబ్లీలో గొంతు ఎత్తిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ కు ఘన సన్మానం..



 గోదావరిఖని న్యూస్..

గౌడ జీవనోపాధి కోసం అసెంబ్లీలో గొంతెత్తిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌ కు ఘన సన్మానం..

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు బెందె నాగభూషణం గౌడ్ ఘనంగా సన్మానించారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం నియోజకవర్గంలోని పోరడుపల్లి గ్రామంలో ఈత, తాటి చెట్లు నశించడంతో గౌడ జీవనోపాధి కోల్పోయిన అంశాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  అసెంబ్లీలో ప్రస్తావించారు.. గౌడ జీవనోపాధి పరిరక్షణ కోసం 40 ఎకరాల భూమిని చెట్ల పెంపకానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో గౌడ కులస్తుల కోసం గల వ్యక్తి మాట్లాడారు.ఈ నేపథ్యంలో గౌడ సమస్యలపై ధైర్యంగా గొంతు ఎత్తిన రామగుండం  ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు బెందె నాగభూషణం గౌడ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి