శనివారం:- ఉద్యోగ విరమణ వయస్సు పెంచవద్దు
నిరుద్యోగ యువతకు ఆశానిపాతం
వయస్సు పెంపు పై అనాసక్తి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సు పెంపును వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సేవా సామాజి కార్యకర్తల కె.ఆనందరావు పలువురు యువకులతో కలిసి శుక్రవారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వయోభారం, స్వల్ప అనారోగ్య సమస్యలు,మానసిక ఒత్తిడి,క్షేత్రస్థాయి పర్యటనలు,
ప్రయాణాలు,వేగవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వంటి సమస్యలతో ఉద్యోగ విరమణ వయస్సు పెంపు పట్ల ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు ఆసక్తి కనబరచడం లేదు.ఉద్యోగ విరమణ అంతరం ఉద్యోగులకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వలేక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఆశనిపాత మైందన్నారు.గత ప్రభుత్వం 58 సం.నుండి 61 సం.లకు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు వల్ల మూడు సంవత్సరాలు నియామకాలు అగాయి, ఇపుడు మరో మూడు సంవత్సరాలు పెంపు, నియామక ప్రక్రియను మరో ఆరుసంవత్సరాలు వెనక్కు వెళుతుంది.నిరుద్యోగులు మరో ఆరు సంవత్సరాలు ఎదురు చూడాలి. ఈ లోగా లక్షల మంది యువకులు ఉద్యోగ కనీస వయస్సును కోల్పోతారు.శాశ్వత నిరుద్యోగులవుతారన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్దన్నారు.ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలను విరమించి కోవాలని కోరారు.కొత్త తరానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నారు.అనంతరం డిప్యూటీ తహసీల్దారు బి.లక్ష్మీకి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు..
10, జనవరి 2026, శనివారం
“ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన..
✍️రామగుండం న్యూస్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి