10, జనవరి 2026, శనివారం

కాంగ్రెస్‌లో చేరికల జోరు – మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్...

 గోదావరిఖని న్యూస్..

రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రామగుండం శాసనసభ్యులు  మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  సమక్షంలో మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు....

పార్టీలో చేరిన అనంతరం కన్నూరి సతీష్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్‌తో పాటు మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామిని మర్యాదపూర్వకంగా కలసి, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కన్నూరి సతీష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి