శ్రీ చైతన్య హైస్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు


@గోదావరిఖని సంజీవ్ గాంధీ నగర్//:


గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక సంజయ్ గాంధీనగర్ లో గల శ్రీ చైతన్య హై స్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్ లో ముందస్తుగా సంక్రాంతి సంబరాల వేడుకలను ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రామగుండం పారిశ్రామిక ప్రాంత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్,  సతీమణి మనాలి ఠాగూర్, ముఖ్య అతిథులుగా విచ్చేసి పండగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదని ప్రేమానురాగాలను, అనుబంధాలను బలపరిచే పర్వదినమని, మన భారతదేశం విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు పుట్టినిల్లు కాబట్టి వాటిని నేటి తరాలకు అందించటానికి పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం పాఠశాల చైర్మన్ జోజి రెడ్డి  డైరెక్టర్ అమిత్ రెడ్డి, మాట్లాడుతూ, ఈ సంక్రాంతి పర్వదినం యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ముగ్గుల పోటీలను నిర్వహించి, బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల ప్రాంగణమంతా భోగి మంటలు, రంగవల్లులు, పతంగుల ఎగురవేయడం, వివిధ నృత్య ప్రదర్శనలతో, రకరకాల కార్యక్రమాలతో మారుమ్రోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రవి వర్మ, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రావణి, ఏవో సందీప్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...