"మంత్రుల సభ నేపథ్యంలో గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్..
రామగుండం పోలీస్ కమిషనరేట్..
"మంత్రుల సభ నేపథ్యంలో గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్..
రేపు (తేదీ: 11-01-2026) రోజున రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ కు ఐటీ శాఖ మంత్రివర్యులు, మంథని శాసనసభ్యులు గౌరవ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి శ్రీ రాజ్యలక్ష్మి గార్డెన్స్ మార్కండేయ కాలనీ లో గోదావరిఖని ఏసీపీ శ్రీ ఎం. రమేష్ సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ... సభా ప్రాంగణంలో వేదిక, పబ్లిక్ గ్యాలరీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ఎంట్రీ –ఎగ్జిట్ మార్గాలు, వి ఐ పి, పబ్లిక్ వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, సభకు హాజరు అయ్యే వారికోసం ఏర్పాట్లు చేసిన భోజనాల ప్రాంతంలో, తదితర భద్రత ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సభ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని ఏసీపీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు,లింగమూర్తి, మంథని సీఐ బి. రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, ఆర్ ఐ దామోదర్, శ్రీనివాస్, ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు...
కామెంట్‌లు