చైనా మాంజా విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు...
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు...ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలోని వివిధ పతంగులు (గాలిపటాలు) విక్రయించే దుకాణాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి, చైనా మాంజా నిల్వలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు.చైనా మాంజా వల్ల మనుషులకు, ముఖ్యంగా చిన్నారులకు, వాహనదారులకు మరియు పక్షులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీఐ తెలిపారు.చైనా మాంజా విక్రయం, నిల్వ మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడినవని స్పష్టం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా లేదా నిల్వ ఉంచినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వ్యాపారులు ఎలాంటి నిషేధిత వస్తువులను విక్రయించకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీలలో ఎస్‌ఐ రమేష్, అనూష తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామెంట్‌లు