8, జనవరి 2026, గురువారం

సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..

 రామగుండం మున్సిపల్ కార్పొరేషన్...

సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి: ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్..

అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని రామగుండం శాసన సభ్యులు ఎం ఎస్ రాజ్  ఠాకూర్ అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై బుధవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) , కమీషనర్ జె.అరుణ శ్రీ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోదావరిఖని పుష్కర ఘాట్  , గోయిల్ వాడ , అంతర్గాo  సమ్మక్క సారలమ్మ జాతర కు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ఏర్పాలు చేయాలని అన్నారు. గోదావరిఖని పుష్కర ఘాట్ వద్ద శాశ్వత ప్రాతిపాదికన చేస్తున్న ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని అన్నారు. తొక్కిసలాటలు , తోపులాటల వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికా బద్దంగా ఏర్పాట్లు  చేయాలని అన్నారు. జాతర జరిగే నాలుగు రోజులు అన్ని విభాగాల అధికారులు ప్రాంగణంలోనే ఉండి పనులు  పర్యవేక్షిoచాలని అన్నారు. భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా  ఎన్ పి డి సి ఎల్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  జల్లు స్నానానికి గోదావరి నది వద్ద సరిపడా షవర్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జాతర  ప్రాంగణంలో 24 గంటలు వైద్య శిబిరం , వైద్యులు , అంబులెన్స్ , ఫైర్  ఇంజన్  అందుబాటులో ఉంచాలని అన్నారు.  వృద్దులు , వికలాంగులు , నడవ లేని వారి సౌకర్యార్ధం  ప్రదాన రహదారి నుండి జాతర  ప్రాంగణం వరకు ఆటో ల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం  కల్పించాలని అన్నారు. జాతర లో సేవలందించడానికి ముందుకు వచ్చే వారిని ముందుగా పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించి మూడు పూటలా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. జాతర  ప్రాంగణo పరిశుభ్రంగా ఉండడానికి ఇప్పటి నుండే చెత్త వేయకుండా చూడాలని అన్నారు. సింగరేణి వాహనాల ద్వారా జాతర పరిసరాలలో లో తట్టు ప్రాంతాల్లో మట్టి నింపాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతర సేవలు అందించాలని పోలీస్ అధికారులను కోరారు. 
అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో జాతరలో గతంలో కంటే మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుoటున్నామని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో లోపం తలెత్తకుండా అవసరమైన సిబ్బందిని , వాహనాలను అందుబాటులో  ఉంచుతామని అన్నారు. 
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ , సుప్రియ, ఎ సి పి.  ఎం. రమేష్ , ఆర్ డి ఓ గంగయ్య , నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , ఎస్ ఇ . గురువీర , ఇ ఇ . రామన్ ,  ఎన్ పి డి సి ఎల్ డి ఇ ప్రభాకర్ , ఎ డి ఇ వెంకటేశ్వర్లు , , సమ్మక్క సారలమ్మ జాతర ఇ ఓ  కాంతా రెడ్డి , జాతర కమిటీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి , సి ఐ లు ప్రసాద రావు , ఇంద్రసేన రెడ్డి , అంతర్గాo , పాల కుర్తి  ఎం పి  డి ఓ లు , ఎం ఆర్ ఓ లు , సింగరేణి , ఎన్ టి పి సి , ఆర్ ఎఫ్ సి ఎల్  ,  హౌసింగ్ , పబ్లిక్ హెల్త్ తదితర  విభాగాల అధికారులు పాల్గొన్నారు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి