గీతాంజలి హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు – రంగవల్లులు, పతంగులతో పాఠశాల ప్రాంగణం కళకళ...

 @గోదావరిఖని న్యూస్... పెద్దపల్లి జిల్లా



స్థానిక గాంధీనగర్ గీతాంజలి హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులకు మరియు పోషక మహిళామణులకు రంగవల్లి పోటీలు నిర్వహించడం జరిగింది. బాలురకు పతంగుల పోటీలు నిర్వహించడం జరిగింది. నేటి సంబరాల్లో హరిదాసు వేషధారణలో విద్యార్థులను పాల్గొని అందర్నీ ఆకట్టుకున్నారు. సంక్రాంతి సంబరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంది రవీందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి  ప్రారంభించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు వివిధ వేషధారణలో వచ్చారు. ప్రధానోపాధ్యాయులు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రకృతిలో మమేకమైన పండుగ అని, ముఖ్యంగా రైతులు తాము పండించిన పంట చేతికి వచ్చేది ఈ మాసంలోనే, వారు పంటలను చూసి మురిసి, ఆనందంలో పంట ఇచ్చిన నేలతల్లికి, ప్రకృతికి సూర్య భగవాన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తారు. పండుగ అంటేనే బంధాలను బంధుత్వాలతో పెనువేసుకునే గొప్ప పండుగ అని అన్నారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశంతో మకర సంక్రాంతి అని ,దక్షిణాయం నుంచి ఉత్తరానంలోకి ప్రవేశించే సమయాన్ని పుణ్య సమయమును భావిస్తారు. కాబట్టి భోగి,సంక్రాంతి కనుమ మూడు రోజులు చాలా విశిష్టమైనవి. ఈ రోజుల్లో దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని ముఖ్యంగా కనుమ రోజు పాడిపంటలు పండించడానికి ఉపయోగపడే పశువులకు స్నానం చేయించి పూలదండలతో సత్కరించి పశువులలో దైవత్యాన్ని చూడడం గొప్పదని విద్యార్థులకు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పోషకులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రామగుండం రైల్వేస్టేషన్‌లో అద్భుతం… రెండు నిండు ప్రాణాలు కాపాడిన నర్సింగ్ ఆఫీసర్..

పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్..

రామగుండం రైల్వే ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: మిషన్ భగీరథ ఆపరేటర్ మృతి​

48వ డివిజన్‌లో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

గోదావరిఖని మారుతి నగర్‌లో పేకాట స్థావరంపై దాడి– ఏడుగురు అరెస్ట్ .. "ఖని"వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి..

లాడ్జీలు,హోటళ్ల నిర్వాహకులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి హెచ్చరిక

Godavarikhani :- ఇది మనహక్కు సమాచార పత్రిక//;; ..డ్రైనేజీ జాం ఇబ్బందులు: వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు – ప్రశంసించిన కార్పొరేటర్ అభ్యర్థి అబ్బాస్ యాదవ్..

అదనపు కలెక్టర్ {స్థానిక సంస్థల} కమిషనర్ జె.అరుణ శ్రీ,ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల..

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన జనసేన ఫోకస్ గెలుపే దిశగా వ్యూహంకు ముఖ్య నాయకులతో సమావేశం ఐనా రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్....

తెలంగాణ ఉద్యమ సేవకు గుర్తింపు – పొన్నం దంపతులకు బిఆర్ఎస్ బి-ఫామ్‌లు...