6, జనవరి 2026, మంగళవారం

ట్రాఫిక్ సిఐ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు.. @గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్


🖇️💥 @GODAVARIKHANI🗞️✍🏻ఇది మన హక్కు సమాచార పత్రిక...✍️🎤 ప్రజాస్వామ్యానికి బలమైన బలం...🖇️🖇️..""           

కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు ట్రాఫిక్ సిఐ బి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో...


 స్థానిక మార్కండేయ కాలనీలోని కాకతీయ జూనియర్ కాలేజ్‌లో ట్రాఫిక్ సిఐ బి. రాజేశ్వరరావు,ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, వాహనానికి సంబంధించిన సర్టిఫికెట్లు కలిగి ఉండడం, ఫోర్ వీలర్‌లో సీట్ బెల్ట్ వాడకం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని విద్యార్థులకు వివరించారు. ఈ విషయాలను తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలని సిఐ సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఈ. ఉపేందర్, ఎస్సై జి. హరి శేఖర్, కళాశాల సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి