మామిడి కుటుంబానికి 75కిలోలరైస్ ను అందజేసిన టివైజెఏజిల్లా నాయకులు...
న్యూస్ గోదావరిఖని*
30 డిసెంబర్ రోజున మామిడి కుమార్ సత్యం గార్ల తండ్రి రాయలింగు స్వర్గస్తులైనారు వారి కుటుంబాన్ని తెలంగాణ యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరపున గురువారం రోజున రాయలింగు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సంతాపాన్ని తెలపడం జరిగింది. వారి కుటుంబానికి 75 కిలోల రైసు ఐదు లీటర్ల నూనె టీ వై జే ఏ ఉమ్మడి జిల్లా నుండి మన యాదవ సోదరులకు మన వంతు చిన్న సహాయంగా అందజేయడంజరిగింది జిల్లా బాధ్యులు వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని,ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుండేటి సతీష్ యాదవ్, కార్యదర్శి కాల్వ రమేష్ యాదవ్, సహాయ కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, జిల్లా బాధ్యులు అనిల్ యాదవ్, మేకల సంతోష్ యాదవ్, మిక్కిలి నేని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...
కామెంట్‌లు