కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి – మార్చి 5న ఢిల్లీపై దండోరా: పరశురాం
ధర్మారం మండలం..
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి -సాధన సమితి అధ్యక్షులు పరశురాం..
కరెన్సీ నోట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురాం కోరారు. ఈ సందర్భంగా గురువారం జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్రం ను కలిసి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించేందుకు కృషి చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన వెంటనే స్పందిస్తూ ఆర్బిఐ గవర్నర్. కేంద్ర ఆర్థిక శాఖ వ్యవహారాల మంత్రి కి లేఖ రాయడం జరిగిందన్నారు. ఇట్టి విషయం అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీకి మెయిల్ ద్వారా, రిజిస్టర్ పోస్టు ద్వారా మనకు పంపించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వ్యవహరాల శాఖ పరిశీలన చేసి ఇది న్యాయమైన కోరిక అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. దీనిని కేంద్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల లో ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అమలు చేయాల్సిందేనని కోరారు. కానీ ఇంతవరకు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించడం లేదు. అందువల్ల మార్చి 5న ఢిల్లీ పై దండోరా కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2026న జరిగే అంబేద్కర్ జయంతోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని అమలు చేసే విధంగా మాట్లాడి సపోర్టు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి,ఎర్రగుంటపల్లి సర్పంచ్ దూడప్రియాంక తిరుపతి,కొత్తూరు మాజీ సర్పంచ్ మద్దెల నరసయ్య.నాయకులు సుంచు మల్లేశం,నేరువట్ల మహేందర్, నేరువట్ల రవి,బొల్లి నందయ్య, పుల్ల కొల్ల లింగమూర్తి, ఇరుగురాల రాజనర్సయ్య, బొల్లి రాజం,సంఘోమ్ రాజ్ కుమార్,తీగుట్ల ప్రణయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు...
కామెంట్‌లు