5 ఇంక్లైన్ కాలనీలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ
గోదావరిఖని నవంబర్ 5 (ఇది మన హక్కు):
యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి – ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి జమాత్-ఎ-ఇస్లామీ హింద్ (JIH) గోదావరిఖని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ప్రచారంలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు 5 ఇంక్లైన్ కాలనీలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయిషా సిద్దిఖా మోడరేటర్‌గా వ్యవహరించారు. సుమారు 40 మంది మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొని కాలనీలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సబీరా నాజ్, ఆయిషా సిద్దిఖా, జాహెదా, నూర్ జహాన్, నాజియా బేగం, రజియా బేగం, షానాజ్, అంజుమ్ బాను పాల్గొన్నారు.
అలాగే నిసార్, సమ్మక్క, పద్మ, రాజేశ్వరి తదితరులు ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడంలో తల్లిదండ్రులు, మహిళలు, విద్యావంతులు, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం అనే సందేశంతో ఈ ప్రచార కార్యక్రమం కొనసాగింది.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి