Ismail Nizami
ఉచిత రెసిడెన్షియల్ లాంగ్‌టర్మ్ శిక్షణకు నవంబర్ 1 వరకు దరఖాస్తులు.
రామగుండం అక్టోబర్ 05 (ఇది మన హక్కు): హైదరాబాద్, అక్టోబర్ 5 NEET-2027 ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించనున్నట్లు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ తెలిపారు.
అనుభవజ్ఞులైన, నిష్ణాతులైన అధ్యాపకులచే Biology, Chemistry, Physics సబ్జెక్టుల్లో ఉచిత శిక్షణతో పాటు విద్యార్థులకు వసతి, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తు ఇలా..
అర్హులైన విద్యార్థులు తమ SSC, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, NEET-2026 ర్యాంక్ కార్డు/స్కోర్ కార్డులను స్కాన్ చేసి ఈ-మెయిల్ ద్వారా పంపాలి.
📧 tsrjclbnagar@gmail.com
📧 acadtmrjcboysbarkas@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 1
NEET-2027లో మంచి ర్యాంకు సాధించి వైద్య విద్యలో ప్రవేశం పొందేందుకు మైనారిటీ విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ పిలుపునిచ్చారు.
ఫోటో క్యాప్షన్:
NEET-2027 ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్‌ను మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ.
temries Councellor HMS-National Secretary
vice President - jIH


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి