అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి.. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
పెద్దపల్లి, అక్టోబర్ 05 (ఇది మన హక్కు):ప్రజవాణి లో స్వీకరించిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
పెద్దపల్లి మండలం కనగర్తికి చెందిన బండ్రి అజయ్ కుమార్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, పీడీ హౌసింగ్‌కు రాస్తూ నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాంపల్లి గ్రామానికి చెందిన గౌడ అశోక్ తన కుమార్తె గౌడ శ్రీవల్లికి 100 శాతం వికలాంగత్వం ఉందని, పెన్షన్ మంజూరు చేయాలని కోరగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎలిగేడు మండలం నర్సాపూర్‌కు చెందిన తంగెళ అనిత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేశానని, జిల్లాలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరగా, సంబంధిత సొసైటీకి రాస్తూ ఔట్సోర్సింగ్ కింద అవకాశాలు వచ్చినప్పుడు నిబంధనల మేరకు పరిశీలించాలని తెలిపారు.
రామగిరి మండలం రాజాపూర్‌కు చెందిన మల్లేశ్వరి తన ఇంటికి సింగరేణి ప్రాజెక్టు నంబర్ కేటాయించాలని కోరగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి