పెండింగ్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి.. ప్రజలకు చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
పెద్దపల్లి, అక్టోబర్ 9 (ఇది మన హక్కు):
సమాచార హక్కు చట్టం–2005 కింద అందిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను హెచ్చరించారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు వారోత్సవాలు–2026 సందర్భంగా పౌర సమాచార అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్టోబర్ 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల నేపథ్యంలో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో ప్రజలకు చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, మొదటి అప్పీళ్ల అధికారులు చట్టం ప్రకారం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రజలకు అందించాల్సిన సమాచారాన్ని పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రభుత్వ శాఖలు స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. అధికారుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బండి ప్రకాష్, హెచ్ సెక్షన్ పర్యవేక్షకులు ఈశ్వర్, డీఈఓ శారద, జిల్లా మత్స్యశాఖ అధికారి నరేష్ కుమార్ నాయుడు, జిల్లా బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. రవీందర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నా

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి