విద్యార్థుల అభ్యసన పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలి.. డిజిటల్ అక్షరాస్యత శిక్షణ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, అక్టోబర్ 08 (ఇది మన హక్కు): డిజిటల్ సాంకేతికతను తరగతి గది బోధనతో సమర్థవంతంగా అనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ అక్షరాస్యత శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణలో అందిస్తున్న అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఖాన్ అకాడమీ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ బోధన అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిర్దేశిత అభ్యసన ఫలితాలను (Learning Outcomes–LOs) సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఖాన్ అకాడమీ అందించే డిజిటల్ వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ విద్యార్థుల అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు గుర్తించి, వారి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటల్ సాధనాలను విద్యార్థుల అభ్యసన అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వారా గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలని అన్నారు.
శిక్షణలో పొందిన జ్ఞానాన్ని పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల అభ్యసనలో ప్రత్యక్షంగా ఉపయోగపడేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో ఏఎంఓ డా. పి.ఎం. షేక్ పాల్గొని శిక్షణకు సంబంధించిన పలు అంశాలపై ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం అందించారు. శిక్షణ అంశాలను పూర్తిగా అవగాహన చేసుకొని పాఠశాల స్థాయిలో అమలు చేయాలని సూచించారు.
డిజిటల్ అక్షరాస్యత శిక్షణ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖాన్ అకాడమీ మార్గదర్శకాల ప్రకారం శిక్షణను నాణ్యతతో అమలు చేసి విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులు, 14 మండలాలకు చెందిన గణిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి