11 పీఎం శ్రీ పాఠశాలల్లో ఖాళీలు.. అక్టోబర్ 10లోపు దరఖాస్తులు.. నెలకు రూ.16,500 గౌరవ వేతనం: డీఈఓ జి. శారద
పెద్దపల్లి, అక్టోబర్ 07 (ఇది మన హక్కు): పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ప్రత్యేకావసరాల పిల్లలకు విద్యాబోధన అందించేందుకు తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్స్ నియామకానికి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐదు నెలల కాలానికి చేపట్టనున్న ఈ నియామకాల్లో పీఎం శ్రీ రామగుండం, జడ్పీహెచ్ఎస్ కమాన్‌పూర్, జడ్పీహెచ్ఎస్ అప్పన్నపేట్, జడ్పీహెచ్ఎస్ పోత్కపల్లి, జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్, టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మేడారం, టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మల్లాపూర్, టీజీఎంఎస్ రామగుండం, టీజీఎంఎస్ జూలపల్లి, టీజీఎంఎస్ మల్యాల్ (శ్రీరాంపూర్), టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మంథని పాఠశాలల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్లకు ధృవపత్రాలతో కూడిన దరఖాస్తులను అక్టోబర్ 10లోపు సమర్పించాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్‌లను సంప్రదించాలని డీఈఓ జి. శారద సూచించారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి