తెలుగు సీరత్ పుస్తకాలు, ఇస్లామిక్ సాహిత్యం అందజేత
రామగుండం, అక్టోబర్ 04 (ఇది మన హక్కు):కమాన్‌పూర్ మండలం గుండారం గ్రామంలోని మసీద్-ఎ-మొహమ్మదియాను జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా మతపరమైన అవగాహన, ఇస్లామిక్ సాహిత్య ప్రచారం తదితర అంశాలపై చర్చించారు.
జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని యూనిట్ అధ్యక్షులు సయ్యద్ జావిద్ అక్మల్ హుస్సైనీ సాహెబ్, ఉపాధ్యక్షులు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ (TEMRIES కౌన్సిలర్, HMS నేషనల్ సెక్రటరీ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమాన్‌పూర్–ముత్తారం మండలాల ఇన్చార్జ్ అహ్మద్ పాషా ఆధ్వర్యంలో తెలుగు భాషలో ప్రచురించిన “విశ్వ ప్రవక్త ముహమ్మద్ ﷺ – జీవితం, సందేశం” సీరత్ పుస్తకాలు మరియు ఇతర ఇస్లామిక్ సాహిత్యాన్ని అందజేశారు.
మసీద్-ఎ-మొహమ్మదియా, గుండారం కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాషలో సీరత్ గ్రంథాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవితం, బోధనలు మరియు మానవతా సందేశాన్ని ప్రజలకు చేరువ చేయడం అభినందనీయమని పాల్గొన్నవారు పేర్కొన్నారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి